వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కొత్తకోట (CLiC2NEWS): వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న గరుడ బస్సు కోత్త కోట మండలం ముమ్మాళ్లపల్లి వద్ద చెరకులోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే మరణించిన ముగ్గురు బస్సులో ప్రయాణిస్తున్న వారే. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.