Tirupathi ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితం వెలువడింది. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 31 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన వైసీపీ ఘనవిజయం సాధించింది. గురుమూర్తికి మొత్తం 5,37,152 ఓట్లు పోలవ్వగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి 3,05,209 ఓట్లు పోలయ్యాయి. ఇక ఇదిలా ఉంటె, బీజేపీ-జనసేన అభ్యర్ధికి 50,739 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 8,477 ఓట్లు నోటాకు 13,401 ఓట్లు పోలయ్యాయి.
తిరుపతి ఉప ఎన్నిక | ||
---|---|---|
Party | Votes | |
వైఎస్సార్‌సీపీ | 623774 | |
టీడీపీ | 353190 | |
బీజేపీ | 56820 |
విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దు
విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను వైఎస్సార్‌సీపీ ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు, ఈసీ సూచనల మేరకు సంబరాలు చేయొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.