తోడ‌బుట్టిన ఆశ‌యానికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు: చిరంజీవి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరు వింటే అభిమానులు ఆనందంతో గంతులేస్తారు. ఆయ‌న ఒక ప్ర‌భంజ‌నం. ఆయ‌న క‌నిపిస్తే చాలు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా గోల చేస్తారు. సెల‌బ్రిటీలు సైతం ఆయ‌న‌ని ఇష్ట‌ప‌డుతుంటూరు. కొంద‌రు హీరోలు త‌మ సినిమాల‌లో ప‌వ‌న్‌ని అనుక‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ప‌వ‌న్ సినిమాల‌తో కాకుండా ఆయ‌న వ్య‌క్తిత్వంతో ఎంతోమంది మ‌న‌సులు గెలుచుకున్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు 50వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయన‌కు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు, స్నేహితులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప‌వ‌ర్ స్టార్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.


చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్

అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.“
అంటూ చిరంజీవి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.