టిపిసిసి చీఫ్‌గా రేవంత్‌: సింహాం అంటూ వర్మ ట్వీట్

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ పిసిసి చీఫ్ చీఫ్ ప‌ద‌విపై సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పీసీసీ పీఠం కోసం చాలా మంది ఆశ పడ్డారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం టి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డిని నియమించింది. ఈ మేరకు నిన్న ఎఐసిసి నిన్న కీల‌క ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సొంత పార్టీ నేతలు కొంద‌రు గుర్రుగా ఉన్నప్పటికీ.. ప‌లువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రేవంత్‌రెడ్డిని పిసిసి చీఫ్‌గా నియమించడంపై డైరెక్టర్‌ రాం గోపాల్‌ వర్మ స్పందించారు. రేవంత్‌ రెడ్డిని పోగుడుతూ ఓ ట్వీట్‌ చేశాడు.

`రేవంత్‌ ను పీసీసీ అధ్యక్షుడిగా నియ‌మించి కాంగ్రెస్‌ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పులులన్నీ రేవంత్‌ రెడ్డి అనే సింహానికి భయపడతాయి.` అంటూ వ‌ర్మ ట్వీట్ పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.