నేటి ఆర్ధరాత్రి నుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు సమాచారం. ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసే నేపథ్యంలో నేటి అర్ధరాత్రి నుండి ఆదివారం అర్ధరాత్రి వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వామనాలకు అనుమతి లేదని వెల్లడించారు. అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా ఎలాంటి వాహనాకు అనుమతి లేదు. బస్సులు లోయర్ ట్యాంక్‌బండ్ నుండే వెళ్లాలని పోలీసులు సూచించారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు గన్‌పార్క్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ ప్రాంతంలో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.