ఐటిఐ అర్హతతో బెల్‌లో టెక్నీషియన్ పోస్టులు

BEL: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్‌లో 32 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (ఇఎటి) -8
టెక్నీషియన్ సి- 21
జూనియర్ అసిస్టెంట్ -3
రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులను ఏప్రిల్ 9వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ఎంపికైన వారిలో టెక్నీషియన్ ,జూనియర్ అసిస్టెంట్ లకు నెలకు రూ. 21,500- 82,000.. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ ఉద్యోగులకు రూ.24,500 నుండి 90వేలు ఉంటుంది.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ
పోస్టులకు మూడేళ్ల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ -సి
ఈ పోస్టులకు పదో తరగతి, ఐటిఐ (ఎలక్ట్రానిక్స్ -మెకానిక్ ట్రేడ్), ఏడాది అప్రెంటిస్‌షిప్ చేయాలి. లేదా పదో తరగతి, మూడేళ్ల అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు అవసరం.
జూనియర్ అసిస్టెంట్
ఈ పోస్టుకు బికాం/ బిబిఎం డిగ్రీ
ఈ ఉద్యోగాలన్నింటికి డిగ్రీ/ డిప్లొమా/ ఐటిఐ జనరల్ అభ్యర్థులు 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సి/ ఎస్‌టి / దివ్యాంగులకు 55% ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 01.03.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఒబిసిలకు మూడేళ్లు, ఎస్‌సి, ఎస్‌టికు, ఎస్‌సి, ఎస్‌టిలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, మాజి సైనిక ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు జనరల్ , ఒబిసి, ఇడబ్ల్యుఎస్‌లకు రూ.280 (18% జిఎస్‌టి అదనం) . ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులకు ఫీజు లేదు. పరీక్ష తేదీ.. రాత పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలకు www.bel-india.in వెబ్‌సైట్ చూడగలరు.