తెలంగాణలోఇద్దరు ఐఎఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఇద్దరు ఐఎఎస్ అధికారులను తెలంగాణ సర్కార్ బదిలీ చేసింది.
ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సునీల్ శర్మను ప్రభుత్వం నియమించింది. ఆయనకు గృహనిర్మాణ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
అలాగే ఆర్ అండ్ బి కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు కేటాయించింది.