టిఆర్ ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సి అభ్యర్థులు ఏకగ్రీవం..

హైదరాబాద్ (CLiC2NEWS) :తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సి ఎన్నికల్లో నామినేషన్‌లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవమైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. 6 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెరాస తరపున అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో.. వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ ఆరుగురు నవంబరు 16వ తేదీన నమినేషన్లు దాఖలు చేశారు.