మంథ‌నిలో టిఆర్ ఎస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుపై స‌మీక్షా స‌మావేశం

మంథని (CLiC2NEWS): ప‌ట్ట‌ణంలోని తెలంగాణ రాష్ట్రస‌మితి పార్టీ కార్యాలయంలో మంథ‌ని టిఆర్ ఎస్ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఆదివారం నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు మండ‌లాల‌కు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అథితిగా పెద్ద‌పెల్లి జెడ్‌పి చైర్మ‌న్ పుట్ట ముధూక‌ర్ పాల్గొన్నారు. తెరాస పార్టీ సభ్యత్వ నమోదు పై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తో పాటు తెరాస పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర కార్యదర్శి, మాజీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ లోక బాపురెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.