నగరంలోని ధర్మపురి అర్వింద్ నివాసంపై టిఆర్ ఎస్ కార్యకర్తల దాడి

హైదరాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్కింద్ ఇంటిపై టిఆర్ ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఆయన తల్లి డి.విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపి ఇంటి ముట్టడికి వెళ్లిన టిఆర్ ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల దర్మపురి అర్వింద్ మాట్లాడుతూ టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిఆర్ ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తూ.. దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఆందోళన చేసిన వారిలో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం
Hey there, You have done a fantastic job. I will definitely digg it and personally recommend to my friends.
I’m sure they will be benefited from this site.