TS: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలోళ్ళ బస్తీ పక్కనున్న చంద్రకాపురంలో ఈ ఘటన జరిగింది. మృతులను ఇద్దరు సోదరులు, సోదరిగా గుర్తించారు. వీరి ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు. ప్రారంభించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.