TS: తెలంగాణకు చేరుకున్న 6 లక్షల వ్యాక్సిన్ డోసులు

హైద‌రాబాద్‌: క‌రోనా కేసులు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడంతో అనేక జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కావాలని రాష్ట్రప్రభుత్వం కేంద్ర‌స‌ర్కార్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఈరోజు ఉదయం రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 7.5 లక్షల డోసులు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 6 లక్షల డోసులను అవసరమైన జిల్లాలకు ప్రభుత్వం సరఫరా చేసేందుకు స‌ర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది.

Leave A Reply

Your email address will not be published.