TS: ప్రజలను కాపాడుకుంటాం : మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్ (clic2news):
కరోనా కట్టడికోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఎన్ని వందల కోట్ల రూపాయాలైనా ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను కొవిడ్ 19 భారి నుండి కాపాడుకుంటాం అని మంత్రి స్పష్టం చేశారు. కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని తేల్చిచెప్పారు.
బుధవారం హుజురాబాద్ మండలంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా కారణంగా రాష్ర్ట వ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు నిరాడంబరంగా కొనసాగాయి. వచ్చే కల్యాణోత్సవం అయినా కోట్లాది మంది సమక్షంలో జరగాలని ప్రార్థించాను. కరోనా అంతం కావాలని కోరుకున్నా. ఈ సమయంలో ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ.. ప్రభుత్వానికి తోడుగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.