TS: సినిమా షో సమాయల్లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ కరోనా కట్టడి చర్యలో భాగంగా రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లను కూడా రాత్రి 8 గంటలకే మూసివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సినిమా థియేటర్ల యజమానులు సెకండ్ షోను రద్దు చేసుకున్నారు. మిగతా మూడు షోల సమయాన్ని సవరించారు.
- మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30గంటల వరకు
- మ్యాట్నీ ఫో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు
- ఫస్ట్ షో 5 గంటలకు మొదలై రాత్రి 8 వరకు