TS: ఆలయాల్లో భక్తుల దర్శనాలు ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయని దేవస్థాన యాజమాన్యం తెలిపింది. గత నెల మే 12న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. కాగా 38 రోజుల అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇటు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోను దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
కాగా అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన తెలంగాణ కెబినెట్ లౌక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.