TS: ఇంట‌ర్ రెండో ఏడాది ఫ‌లితాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు ఖ‌రారు

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌రోనా సెకండ్ వేవ్ విజృంభించ‌డంతో ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఫ‌లితాల విడుద‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ మార్గ‌ద‌ర్శ‌కాలు ఖ‌రారు చేసింది. స‌బ్జెక్టుల్లో మొద‌టి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించాల‌ని క‌మిటీ నిర్ణ‌యించారు. ఇంట‌ర్ సెకండియ‌ర్ ప్రాక్టిక‌ల్స్‌కు పూర్తి మార్కులు కేటాయించ‌నున్నారు.

ఇంత‌కు ముందు ఫెయిల్ అయిన స‌బ్జెక్టుల‌కు 35 % మార్కులు ఇవ్వాల‌ని, అలాగే బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ స‌బ్జెక్టుల‌కు రెండో ఏడాది 35 మార్కులు, ప్ర‌యివేటుగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి 35 % మార్కులు ఇవ్వ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌తో సంతృప్తి చెంద‌ని విద్యార్థుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శికి విద్యాశాఖ కార్య‌ద‌ర్శి ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.