TS: కడియం శ్రీహరి సోదరుడు కన్నుమూత

హన్మకొండ (CLiC2NEWS): టిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోదరుడు ప్రభాకర్(51) గుండెపోడుతో మృతి చెందారు. హన్మకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చకిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వరంగల్ ఎస్ ఆర్ ఆర్ తోట పాఠశాలలో ప్రభాకర్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రేపు స్వగ్రామం పర్వతగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.