TS: కర్ఫ్యూ నుంచి మినహాయింపులు..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ వరకు రాష్ర్టంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటలో పేర్కొంది.
గమనిక: నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 51-60, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.
కర్ఫ్యూ నుంచి మినహాయింపులు
- ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు
- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
- టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు
- ఇ- కామర్స్ వస్తువుల డెలివరీకి అనుమతి
- పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, సీఎన్‌జీ, పెట్రోలియం, గ్యాస్ అవుట్‌లెట్లు
- శక్తి ఉత్పాదన, పంపిణీ
- కోల్డ్ స్టోరేజీ, వేర్‌హౌజింగ్
- నీటి సరఫరా, పారిశుద్ధ్యం
- ప్రైవేటే సెక్యూరిటీ సర్వీసులు
- ప్రొడక్షన్ యూనిట్లు
వీరు మినహా మిగతా పౌరులు బయట తిరగడం నిషేధం…
- పైన పేర్కొన్న సంస్థల్లో పనిచేసేవారు(ఐడీ కార్డు తప్పక చూపించాలి)
- కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాధికారులు ఐడీ కార్డు చూపించి ప్రయాణాలు చేయవచ్చు
- డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, ఇతర ఆస్పత్రి సిబ్బందికి అనుమతి
- గర్భిణులు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైనవారు
- ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండు నుంచి రాకపోకలు సాగించేవాళ్లు టికెట్ చూపించాలి.