TS: జులై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ తదితర కరోనా ఆంక్షలు ఎత్తివేతతో విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. శనివారం సమావేశమైన తెలంగాణ కేబినెట్ ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసింది. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదందని.. అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించడం.. భౌతిక దూరాన్ని పాటించడం.. వంటి తదితర కరోనా నియంత్రణ విధానాలను పాటించాలని పేర్కొంది. కాగా కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు తమ సహకారం అందించాలని కేబినెట్ ఈ సందర్భంగా కోరింది.