TS: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల తీరుపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ప్రగతిభవన్లో 5 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు.
సమావేశంలో ప్రాధాన్య క్రమంలో పల్లెలు, పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్లకు సీఎం నూతన కార్లను అందజేశారు. పల్లె, పట్టణ ప్రగతి అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ సమావేశంలో పురపాలక, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సీఎస్ సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.