TS: ప్రైవేటు దవాఖానాల్లో కరోనా చికిత్స ధరలు ఖరారు

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా చికిత్సకు సంబంధించి ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్స ఛార్జీలపై వైద్యారోగ్య శాఖ జీవో 40 జారీ చేసింది.
- సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ.4 వేలు
- ఐసీయూ వార్డులో రోజుకు గరిష్టంగా రూ. 7,500
- వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ. 9 వేలు
- పీపీఈ కిట్ ధర రూ. 273కు మించరాదు.
- హెచ్ఆర్సీటీ – రూ. 1995
- డిజిటల్ ఎక్స్‌రే – రూ. 1300
- ఐఎల్6 – రూ. 1300
- డీ డైమర్ పరీక్ష – రూ. 300
- సీఆర్పీ – రూ. 500
- ప్రొకాల్ సీతోసిన్ – రూ. 1400
- ఫెరిటిన్ – రూ. 400
- ఎల్ డీహెచ్ – రూ. 140
- సాధారణ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 2 వేలు, కిలోమీటర్‌కు రూ. 75
- ఆక్సిజన్ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 3 వేలు, కిలోమీటర్‌కు రూ. 125గా ఖరారు చేశారు.