TSRTC : ప‌్రయాణీకులకు శుభవార్త

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్‌లు నడపనున్నట్లు TSRTC ప్రకటించింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడంతో లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. దీనితో అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపనున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకకు సర్వీసులను నడపనుంది. అదేవిధంగా ఏపీ నుండి తెలంగాణకు APSRTC బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.