TS: రాగల 3 రోజుల్లో పలుచోట్ల వానలు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల రాగల 3 రోజుల వరకు వాతావరణ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో ఉరుములు మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 23న ఉరుములు మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.