TS: రాష్ట్రంలో4 వెట‌ర్న‌రీ క‌ళాశాల‌లు: సీఎం కేసీఆర్‌

సిద్దిపేట(CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సిద్దిపేట, నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయ‌న ఈరోజు సిద్దిపేట జిల్లా‌లోని MLA క్యాంపు కార్యాల‌యం, పోలీసు క‌మీష‌న‌రేట్ ప్రారంభించారు. అనంత‌రం ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ..ఇక్క‌డే పుట్టి పెరిగాన‌ని, తొలి క‌లెక్ట‌రేట్ స‌ముదాయం ఇక్క‌డే ప్రా‌రంభించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్ప‌త్తిలో పంజాబ్‌ను అధిగ‌మించింద‌ని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ వ‌చ్చేనాటికి 50 జిన్నింగ్ మిల్లులు ఉండేవి, ఇప్పుడు వాటి సంఖ్య 400కు పెరిగింద‌న్నారు. ” రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మ‌న‌ది. అవినీతిని అరికట్టేందుకే నేరుగా రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జమ చేస్తున్నాం” అన్నారు.

Leave A Reply

Your email address will not be published.