TS: హైకోర్టు న్యాయమూర్తుల విందుకు సిజెఐ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎకె గోస్వామితో పాటు పలువురు జడ్జిలు ఈ విందుకు హాజరయ్యారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఈ సందర్భంగా న్యాయమూర్తులు సత్కరించారు.
