TS: 3 ఉచిత అంబులెన్సులు ప్రారంభించిన ఉత్త‌మ్‌

హైదరాాబాద్​ (CLiC2NEWS): గాంధీ భవన్​లో మూడు ఉచిత అంబులెన్సు సర్వీసులను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కమార్​ రెడ్డి ప్రారంభించారు. ఈ అంబులెన్సులు గంటలు పేదలకు అవసరమైన సేవలు అందిస్తాయని ఉత్తమ్​ కుమార్ తెలిపారు. కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేప‌థ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో ఈ మూడు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.

అంబులెన్స్ ఉచిత సేవల కోసం గాంధీ భవన్ హెల్ప్ డెస్క్ 040-24601254కి కాల్ చేసి అంబులెన్స్‌ అవసరాలను తెలియచేస్తే.. పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి,  పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.