TS: పదోతరగతిలో 6 పేపర్లే..

హైదరాబాద్ (CLiC2NEWS): టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2021-22 విద్యా సంవత్సరానికి పదో తరగతిలో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. మొత్తం ఆరు సబ్జెకులలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.