TS: నిబంధనల ఉల్లంఘనపై 907 కేసులు..

హైదరాబాద్ (CLiC2NEWS): న్యూఇయర్ వేడుకలలో నిబంధనల ఉల్లంఘనపై 907 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కారోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిగింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తీసుకున్న చర్యలపై డిజిపి మహేందర్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. సమయానికి మించి వేడుకలు నిర్వహించింనందుకు 263, పబ్లిక్ న్యూసెన్స్ కింద 644 కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. మాస్కులు లేని వారికి జరిమానాలు విధిస్తున్నామని డిజిపి తెలిపారు. డిసెంబరు 24వ తేదీ నుండి జనవరి 2 వరకు 16,430 మందికి జరిమానా విధించామన్నారు. జనవరి 10 వ తేదీ వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతివ్వడం లేదని తెలిపారు. విద్యాసంస్థలను , కోర్టులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది.