TS Corona: కొత్తగా 1,897 కేసులు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సాయంత్రం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో 15 మంది కోవిడ్ బారిన పడిన మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.