TS Corona: కొత్తగా 5,892 కేసులు.. 46 మంది మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో  76,047 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుప‌గా  5892  కేసులు నమోదయ్యాయి.  ఈ మేర‌కు వైద్యారోగ్య‌శాఖ శుక్ర‌వారం ఉద‌యం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,640 కి చేరింది.  24 గంటల్లో 9,122 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 4,05,164  మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనాతో 46 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2625 కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 73,851 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,104, రంగారెడ్డి జిల్లాలో 443, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 378, వరంగల్‌ అర్బన్‌లో 321, నల్గొండలో 323, కరీంనగర్‌లో 263, నాగర్‌ కర్నూల్‌లో 204, సిద్దిపేటలో 201 కేసులు నమోదయ్యాయని బులిటెన్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.