TS Corona: 10,122 కేసులు.. 52 మరణాలు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 99,638 పరీక్షలు నిర్వహించగా 10,122 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. తాజాగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 52 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2094 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,221 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1440 కేసులు ఉన్నాయి. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 751, రంగారెడ్డిలో 621, వరంగల్ అర్బన్‌లో 653, నిజామాబాద్‌లో 498, నల్లగొండలో 469, ఖమ్మంలో 424, మహబూబ్‌నగర్‌లో 417, కరీంనగర్ జిల్లాలో 369 చొప్పున నమోదయ్యాయి.