TS: గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలకు కరోనా పాజిటివ్..

హైదరాబాద్ (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలకు కరోనా సోకింది. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని బిసి సంక్షేమ గురుకుల పాఠశాలలో వారం రోజుల క్రితం ఒక విద్యార్థినికి జ్వరం రావడంతో ఇంటికి పంపించారు. ఆమెకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని విద్యార్థిని తండ్రి పాఠశాల ప్రిస్సిపల్‌కు సమాచారాన్ని అందించాడు. దీంతో పాఠశాలలోని 300 మంది బాలికలకు అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించగా.. 24 మందికి పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.