TS CoronaVaccine: గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరాకు రాష్ట్ర సర్కార్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్ర వైద్య సదుపాయాల మౌలిక వసతుల సంస్థ (టిఎస్ ఎంఐడిసి) ద్వారా కోటి టీకాల కోసం ఈ టెండర్లను పిలిచింది. ఈ మేరకు ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ప్రభుత్వం సేకరించనుంది.
టెండర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 26న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీ. 6 నెలల్లో 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. సప్లయర్ నెలకు 1.5 మిలియన్ డోసులను విధిగా సరఫరా చేయాల్సి ఉంటుంది. రాష్ర్టంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వాలని ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.