ఎడ్‌సెట్: ప్రవేశ పరీక్షలో మార్పులు.. కామన్ సిలబస్..

వరంగల్ (CLiC2NEWS): ప్రస్తుతం 1-10 తరగతి సిలబస్ ఆధారంగా ఎడ్‌సెట్-2021 నిర్వహించనున్నట్టు కాకతీయ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టిరమేశ్ తెలిపారు. సర్కార్ నిర్ణయం మేరకు బీఎడ్ ఎంట్రన్స్‌లో మౌలిక మార్పులు చేసినట్టు తెలిపారు. ఎడ్‌సెట్-2021 విధానంలో వచ్చిన మార్పులను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. గతంలో మాదిరిగా కాకుండా వివిధ రకాల డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు వేర్వేరుగా కాకుండా కామన్ సిలబస్‌తో కామన్ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వివరాల కోసం edcet.tsche.ac.in వెబ్‌సైట్ చూడాలన్నారు. కాగా ఎడ్‌సెట్ పరీక్ష ఫీజును ఈ నెల ఏడో తేదీ వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాలని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు. ఆలస్య రుసుముతో ఈ నెల 15 వరకు అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.