TS: న‌వంబ‌రు 27 నుండి లాసెట్ కౌన్సెలింగ్‌..

హైద‌రాబాద్(CLiC2NEWS)‌: తెలంగాణ రాష్ట్రంలో న్యాయ‌వాద కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు టిఎస్ లాసెట్‌, పిజిలాసెట్ ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌లైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌లు న‌వంబరు 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.  స‌ర్టిఫికేట్  వెరిఫికేష‌న్ ఈనెల 27 నుండి డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు ఉంటుంది. ఈసంవ‌త్స‌రం మొత్తం 7,069 సీట్లు ఉన్నాయి. ఎన్‌సిసి, క్యాప్, దివ్యాంగ‌,  స్పోర్ట్స్ కోటా స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ డిసెంబ‌రు 6వ‌తేదీ నుండి 10వ తేదీవ‌ర‌కు ఉంటుంది. వెబ్ ఆప్ష‌న్లు డిసెంబ‌రు 11నుండి 13వ‌ర‌కు ఉంటుంది. సీటు పొందిన అభ్య‌ర్థులు కాలేజీల్లో రిపోర్టంగ్ తేది డిసెంబరు 18 నుండి 23వ‌ర‌కు ఉంటుంది. వ‌చ్చేనెల డిసెంబ‌రు 27 నుండి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతాయి.

Leave A Reply

Your email address will not be published.