TS: వైభవంగా యాదాద్రిలో లక్ష పుష్పార్చన

యాదాద్రి (CLiC2NEWS): శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారి ఆలయంలో సోమవారం లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఈ రోజు ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వేదపండితులు రకరకాల పుష్పములతో పుష్పార్చన, సహస్రనామాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రతి ఏకాదశి రోజున స్వామి వారికి లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం. సుమారు రెండుగంటల పాటు పూజా కార్యక్రమం కొనసాగింది.
శ్రీ లక్ష్మి నారసింహస్వామివారిని భారత హాకీ జట్టు మాజి కెప్టెన్, తెలంగాణ హాకి సెక్రటరి ముఖేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సత్కరించారు.