TS LockDown: మ‌రో 10 రోజులు పొడిగింపు

ఆ ప్రాంతాల్లో మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కే..

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధ్య‌క్షుత‌న స‌మావేశ‌మైన మంత్రి వ‌ర్గం క‌రోనా ప‌రిస్థితుల‌, లాక్‌డౌన్‌పై చ‌ర్చించింది. లాక్డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. మంగ‌ళ‌వారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వ‌ర‌కు ఉన్న లాక్‌డైన్ స‌డ‌లింపును సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లినవారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి మరో గంటపాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు సమయమిస్తారు.

ఆ ప్రాంతాల్లో మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కే..

ఆ తర్వాత నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం ఇప్పుడు కొనసాగుతున్న లాక్‌డౌన్‌ యథాతథంగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

అర్హుల‌కు రేష‌న్ కార్డులు
ద‌ర‌ఖాస్తు చేసుకున్న అర్హుల‌కు రేష‌న్ కార్డులు మంజూరు చేయాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,46,469 మంది అర్హుల‌కు రేష‌న్ కార్డుల‌ను అధికారులు అంద‌జేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.