TS: తుది దశకు కొత్త‌ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ

హైదరాబాద్‌ (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త‌ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసీ, టీఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ధ్రువీకరణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్నది. కొత్త రేష‌న్ కార్డుల జారీ అంశంపై బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బుధ‌వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4,15,901 కొత్త రేష‌న్‌కార్డుల ద‌ర‌ఖాస్తుల‌ విచారణ తుదిదశకు చేరుకుందని మంత్రి తెలిపారు. త్వరలోనే లబ్ధిదారులను గుర్తించి వీలైనంత త్వరగా వారికి కార్డులతో పాటు రేషన్ ఒకేసారి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. పదిహేను రోజులుగా జిల్లా స్థాయిలో రెవెన్యూతో పాటు ఇతర సిబ్బంది, జిహెచ్ఎంసీతో పాటు ఇతర సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.