TS: 7న టిపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతా: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): వచ్చేనెల (జులై) 7న తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని రేవంత్‌రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రేవంత్‌రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని అన్నీ.. ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జులై 7వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.