TS: మాజీ ప్రధాని పీవీకి కెటిఆర్ నివాళి

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా ఐటి మంత్రి కెటిఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని మంత్రి కొనియాడారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

`ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి` అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.