TS: నేడు టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

హైదరాబాద్(CLiC2NEWS) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనుంది. ధాన్యం కొనుగోళ్లో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్రం స్పష్టతనిచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని తెరాస ప్రకటించిన విషయం తెలిసినదే. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతులను ఆయోమయానికి గురిచేస్తున్న ద్వంద్వ విధానం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.