TS: రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు ప్రకటించింది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో ఏర్పడిన పరిస్థితులపై సిఎం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో ఈరోజుసాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల దృష్ట్యా రేపు (మంగళవారం) తెలంగాణ వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని విద్యా సంస్థలకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 28 సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.