TS: టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు ఖ‌రారు

హైద‌రాబాద్(CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే కోటాలో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. శాస‌న మండ‌లి మాజీ ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, బండ‌ప్ర‌కాశ్‌, కౌశిక్ రెడ్డి, సిద్దిపేట మాజి క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామి రెడ్డి, త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావుల‌కు అభ్య‌ర్థుల‌గా అవ‌కాశం క‌ల్పించారు. వీరు  ఈరోజు నామినేష‌న్లు దాఖలు చేయ‌నున్నారు. ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక ఏక‌గ్రీవం కానుంది.

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్

 

Leave A Reply

Your email address will not be published.