TS: ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) అవార్డును సొంతం చేసుకుంది. దేశం నుండి ఉత్తమ పర్యాటక గ్రామం కేటగిరి కింద తెలంగాణ నుండి పోచంపల్లి, మధ్యప్రదేశ్లోని లాధ్పురా ఖాస్, మేఘాలయ నుండి కోంగ్తాంగ్ గ్రామాలు నామినేట్ అయ్యాయి. ఈ మూడు గ్రామాలలో ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. వచ్చేనెల డిసెంబరు 2వ తేదీన మాడ్రిడ్లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. భూదాన ఉద్యమంతో పోచంపల్లి భూదాన పోచంపల్లిగా ప్రసిద్ధి పొందింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.
ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా పోచంపల్లి గ్రామ ప్రజలకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు.
My compliments to the people of Pochampally, Telangana on being selected as one of the best Tourism Villages by United Nations World Tourism Organisation 👏
The prestigious award will be given on the occasion of 24th session of the UNWTO General Assembly on Dec 2 in Madrid,Spain
— KTR (@KTRTRS) November 16, 2021