TS: రూ.1,280 కోట్లతో 17 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ ఫతేనగర్‌లో STP (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మితమయ్యే ఈప్లాంట్ నిర్మణానికి రూ.317 కోట్లు ఖర్చవుతుంది. దీంతో పాటు రూ.1280 కోట్లతో 17 STPలు నిర్మించబోతున్నామని తెలియజేశారు. దీని ద్వారా 376.5 ఎంఎల్‌డీల మురుగు నీరు శుద్ధి చేయగలమని కెటిఆర్ ప్రకటించారు. భారతదేశంలో ఉన్న మహానగరాలలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో 40% (772 ఎంఎల్‌డీ) మురికి నీటిని STP ల ద్వారా శుద్ధి చేస్తున్నాం, కానీ ఇది సరిపోదు, అందుకు 17 STP లను కూకట్‌పల్లి, కుత్బుల్లపూర్, శేరిలింగంపల్లి సర్కిల్స్‌లో రూ.1,280 కోట్లతో నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు.