పేదలకి ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే సిఎం కెసిఆర్ లక్ష్యం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో పేదవారికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎర్రమంజిల్‌లో ఉన్నటువంటి రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్‌లతో సమావేశమై పలు ఆస్పత్రులు, నర్సింగ్, మెడికల్ కాలేజీల నిర్మాణాల డిజైన్ ప్లాన్స్‌ను పరిశీలించారు. 14 నర్సింగ్ కాలేజీల నిర్మాణ డిజైన్ లను ఎఇఎం ఆలోచనలకు అనుగుణంగా స్వల్ప మార్పులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 8 కొత్త వైద్య కళాశాలలను నిర్మించనున్న విషయం తెలిసినదే. వరంగల్ లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, హైదరాబాద్ నగర నలువైపులా 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, నిమ్స్ ఆస్పత్రి విస్తరణకు సంబంధించిన తదితర అంశాలపై ఆయన చర్చించారు.