TSPECET: ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టెస్ట్ ఫ‌లితాలు విడుద‌ల

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణలో వ్యాయామ ఉపాధ్యాయ విద్య ప్ర‌వేశ ప‌రీక్ష ( TSPECET-2021 ) ఫలితాలు సోమ‌వారం విడుదల చేశారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబ్రాది, పీఈ సెట్‌ చైర్మన్‌, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ గోపాల్‌రెడ్డి ఫలితాలను విడుద‌ల చేశారు. బిపిఇడికి 1787 మంది అబ్య‌ర్థులు ఆర్హ‌త సాధించారు. డిపిఇడికి 1207 మంది అర్హ‌త సాధించిన‌ట్లు తెలిపారు. డిపెడ్‌లో భూపాల‌ప‌ల్లి విద్యార్థి సృజ‌న్ మొద‌టి ర్యాంకు సాధించాడు. అభ్యర్థులు ఫలితాలను https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడ వ‌చ్చ‌ని వర్సిటీ అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.