సిఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం

అమరావతి (CLiC2NEWS): తిరుమలలో అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆహ్వానించారు.
సోమవారం వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్య‌మంత్రికి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.