టిటిడి ఆస్థాన శాశ్వత పండితుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం
హైదరాబాద్ (CLiC2NEWS): తిరుమల తిరుపతి శాశ్వత ఆస్థాన పండితుడిగా ప్రసిద్ధి చెందిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి పరమపదించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కన్నమూశారు. చంద్రశేఖర శాస్త్రి 1925 సంవత్సరంలో ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో జన్మించారు. భారతము ధర్మసూక్ష దర్శనమ, కృష్ణలహరి , రామాయణ రహస్య దర్శిని తదితర గ్రంథాలను రచించారు. వేదాలు, శ్రౌతస్మార్త, వ్యాకరణతర్క వేదస్త సాహిత్యాలను చదివారు. పురాణాలను శాస్త్రబద్ధంగా చెప్తూ ఎందరో ఆస్తికులకు ధర్మమార్గాన్ని చూపించారు.