రాబోయే రోజుల్లో టిటిడి సేవలు వాట్సప్ గవర్నెర్స్‌లోకి: సిఎం
![](https://clic2news.com/wp-content/themes/publisher/images/default-thumb/publisher-lg.png)
అమరావతి (CLiC2NEWS): ఇక నుండి తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని కూడా వాట్సప్ గవర్నెన్స్‌లోకి తీసుకురానున్నారు. ఎపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా వాట్సప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ప్రభుత్వం చేపట్టే పథకాలు నేరుగా వాట్సాప్‌లో ప్రజలకు చేరుతుంది. అదేవిధంగా ప్రజలు తమ ఫిర్యదులు సైతం వాట్సాప్ ద్వారా ప్రభుత్వాధికారులకు విన్నవించుకోవచ్చు. అదేవిధంగా టిటిడి సేవల్ని సైతం వాట్సాప్ గవర్నెన్స్‌లోకీ తీసుకొస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం , శ్రీశైలం మల్లన్న ఆలయంలోనూ వాట్సప్ సేవలు అందుబాటులోకీ తెచ్చినట్లు సమాచారం.
సినిమా టికెట్లు, రైలు టికెట్లు , అర్టిసి బస్సుల జిపిఎస్ ట్రాకింగ్ వాట్సప్‌లోనే చూసుకునే సదుపాయం కల్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైలు టికెట్లు పొందే సదుపాయం కల్పిస్తామని సిఎం తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సప్ లోనే అందుబాటులోకి ఉంచాలన్నారు. వాట్సప్ టెక్ట్స్ చేయలేని వారు వాయిస్ మెసెజ్ పెట్టేలా సర్వీస్ అందుబాలోకీ తెస్తామన్నారు.